BSF: సరిహద్దుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
పంజాబ్ (Punjab) సరిహద్దుల్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం (BSF) హతమార్చింది.
BSF kills two terrorists at Attari border: న్యూఢిల్లీ: పంజాబ్ (Punjab) సరిహద్దుల్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం ( BSF ) హతమార్చింది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అట్టారి (Attari border) సరిహద్దుల్లోని రాజతాల్ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ( terrorists ) దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని గుర్తించిన బీఎస్‌ఎఫ్ 71 బెటాలియన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారని అధికారులు పేర్కొన్నారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో (encounter) ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. Also read: Telangana: పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి
ఈ ఎన్‌కౌంటర్ అనంతరం భద్రతా సిబ్బంది అట్టారి సరిహద్దుల్లో గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సరిహద్దుల్లో దట్టమైన పొగమంచు ఉండటంతో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. Also read: Farmer protests: సిక్కు మతగురువు ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook