బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆఫర్: ప్రీపెయిడ్ ప్యాక్‌తో సంవత్సరం పాటు రోజుకి 1జీబీ డేటా
టెలికామ్ రంగంలో జియో మార్కెట్‌ను తట్టుకోవడం కోసం దేశీయ సంస్థలు పోటీ పడుతున్నాయి.
టెలికామ్ రంగంలో జియో మార్కెట్‌ను తట్టుకోవడం కోసం దేశీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. అందుకు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా మినహాయింపు కాదు. ఈ క్రమంలో ఈ సంస్థ ఇటీవలే కొత్త ప్రీపెయిడ్ ప్యాక్ తీసుకొచ్చింది. రూ.999 తో రీఛార్జీ చేయించుకుంటే చాలు.. సంవత్సరం పాటు రోజుకి 1జీబీ లిమిట్‌తో అపరిమత డేటా ఇవ్వడంతో పాటు.. 181 రోజుల పాటు లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఉచితం అని కూడా చెబుతోంది.
40 కేబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌తో అందించే డేటా స్పీడ్‌తో ఈ ఆఫర్ ప్రకటించింది బీఎస్‌ఎన్‌ఎల్. అదే విధంగా మొదటి 181 రోజులు రోజుకి 100 ఉచిత మెసేజ్‌లు పంపించే సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్. ఇప్పటికే జియో 60జీబీ 4జీ డేటాని.. అదే విధంగా ఎయిర్‌టెల్ అన్ని హ్యాండ్ సెట్లలో 60జీబీ డేటాని 90 రోజుల పాటు అందిస్తున్న క్రమంలో ఈ కొత్త ఆఫర్‌ని బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకువస్తోంది.