లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాల సీతారామన్ ఆర్ధిక వ్యవస్థకు రవాణా వ్యవస్థే కీలకమన్నారు. దీనికి మెరుగులు దిద్దితే మన ఆర్ధిక వ్యవస్థ మరింత పరుగులు పెడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ సారి రవాణా వ్యవస్థలో తీసుకుంటున్న చర్యలు గురించి ఆర్ధిక మంత్రి సభలో వివరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వే భారీ పెట్టుబడులు


ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి  మాట్లాడుతూ రవాణా వ్యవస్థలో కీలకమైన రైల్వేకు విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. రైల్వేల్లో రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడి అవసరముందన్నారు. దీని కోసమే పీపీపీ అమలు చేస్తున్నామని తెలిపారు. 


మెట్రో  విస్తరణకు చర్యలు


దేశంలో మెట్రో రైలు సర్వీసులు పెంచాల్సిన ఆవశ్యకతను సభలో నిర్మాల సీతారామన్ వివరించారు.  ఇప్పటి వరకూ దేశంలో 657కి.మీ.ల మెట్రో మార్గం ఉందన్న మంత్రి.. మరో 300కి.మీ.ల మెట్రో మార్గానికి అనుమతులు లభించాయన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


చిన్నపట్టణాలకు వినమానం సౌకర్యం


ఉడాన్‌ పథకంతో చిన్న చిన్న పట్టణాలకు విమానయాన సౌకర్యం కలిగిందన్నారు. అలాగే దేశం గుండా జలమార్గంలో రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్నాన్నారు. దీని కోసం సాగరమాల పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.  


సాగరమాల పథకంతో అనుసంధానం


ప్రధానమంత్రి సడక్‌ యోజన, ఉడాన్‌, పారిశ్రామిక కారిడార్‌, రవాణా, రైల్వేలు ఇతర మార్గాలను నిర్మిస్తున్నాం. వీటిని సాగరమాల పథకంతో అనుసంధానం జరుగుతోందని  ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సభలో వివరించారు.