Budget 2021 impacts on EPF: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం రూ. 2.5 లక్షలు దాటినట్టయితే.. ఆ ఆదాయం కూడా Income tax పరిధిలోకే వస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది. వివిధ ప్రావిడెంట్ ఫండ్స్‌పై వడ్డీ రూపంలో ఉద్యోగులకు వచ్చే Tax free income ను పరిమితం చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. వార్షికంగా ఈపీఎఫ్ వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంలో రూ .2.5 లక్షల ఆదాయానికి పన్నును మినహాయించనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏప్రిల్ 1, 2021 న లేదా ఆ తరువాత డిడక్ట్ అయిన ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్స్‌కి మాత్రమే ఈ కొత్త EPF rule వర్తిస్తుంది. సాధారణ పీఎఫ్ ఖాతాలకంటే.. వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) కంట్రిబ్యూషన్స్‌పైనే ఈ కొత్త నియమం ఎక్కువగా ప్రభావం చూపనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదనపు పీఎఫ్ మొత్తంపై పన్ను 
ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రావిడెంట్ ఫండ్‌కు ఉద్యోగుల చట్టబద్దంగా కానీ లేదా స్వచ్ఛందంగా చెల్లించి గడించిన వార్షిక ఆదాయం ( Annual income ) రూ .2.5 లక్షలకు మించి ఉంటే, అప్పుడు ఈ అదనపు EPF contributions ద్వారా వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్న మాట. ఇప్పటి వరకు, ప్రావిడెంట్ ఫండ్‌ ద్వారా వచ్చిన ఆదాయంపై Sec 80c కింద ఉన్న పన్ను మినహాయింపును ఇప్పుడు ఈ విధంగా రూ. 2.5 లక్షలకు పరిమితం చేశారు. EPF scheme కింద, ఒక ఉద్యోగి ఈ పథకానికి 12 శాతం జమ చేస్తుండగా.. అంతే సమాన స్థాయిలో సదరు ఉద్యోగి పని చేస్తోన్న కంపెనీ కూడా జమ చేయాల్సి ఉంటుంది.


Also read : Customs duty on auto parts: వాహనదారులకు, ఆటో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన Budget 2021


EPF interest rate కంటే ఏ బ్యాంకు కూడా డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు ఇవ్వదనే సంగతి అందరికీ తెలిసిందే. పైగా Sec 80C కింద ఈ ఆదాయంపై Income Tax exemption కూడా ఉంది. అందుకే వీపీఎఫ్ ద్వారా మరింత ఆదాయం పొందాలనే భావించే వారి కోసం అదనపు మొత్తాలను పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలా EPF ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటూ వచ్చింది. కానీ కొత్తగా కేంద్రం తీసుకున్న ఈ Tax on EPF interest నిర్ణయం కారణంగా ప్రావిడెంట్ ఫండ్లలో వాల్యుంటరీ పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook