Budget 2022 Live Updates: దేశంలో 5 జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాదిలోనే...
Budget 2022 Live Updates: దేశంలో 5 జీ స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఉండనుందని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రానున్న 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగనట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో త్వరలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
Budget 2022 Live Updates: దేశంలో 5 జీ స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఉండనుందని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రానున్న 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగనట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో త్వరలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ఈసారి ప్రవేశపెడుతున్న బడ్టెట్ చాలా విభిన్నమైందని తెలిపారు. ప్రస్తుతం 75 ఏళ్ల స్వతంత్ర భారతావని..ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమయంలో ఉందని చెప్పిన నిర్మలా సీతారామన్..రానున్న 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ తయారు చేసినట్టు చెప్పారు. ఈసారి బడ్జెట్..ఎస్సీ-ఎస్టీలు, మహిళలు, యువత, రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రానున్న మూడేళ్లలో దేశంలో 4 వందల వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టడమే కాకుండా..25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. దీనికోసం ఇప్పటికే 20 వేల కోట్ల సమీకరిస్తున్నామన్నారు.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్..ఐపీవో త్వరలో విడుదల కానుందని మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తెలిపారు. రానున్న కాలంలో ఆర్గానిక్ వ్యవసాయానికి పెద్దపీట వేసేలా..ప్రోత్సాహిస్తామన్నారు. మరోవైపు దేశంలో 4 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్టు చెప్పారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో అంటే 2022-23లోనే 5జి స్పెక్ట్రం వేలం (5G Spectrum Auction) వేయనున్నట్టు ప్రకటించారు.
Also read: Budget 2022 Live Updates: రానున్న మూడేళ్లలో 4 వందల వందేభారత్ రైళ్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook