కుప్పకూలిన మరో భవనం.. శిథిలాల కింద క్షతగాత్రులు
ఒకే వారంలో కుప్పకూలిన మూడు భవనాలు
నొయిడాలో రెండు భవనాలు కుప్పకూలి ఆరుగురు సజీవ సమాధి అయిన దుర్ఘటన ఇంకా మరువకముందే శనివారం ఇదే నొయిడాలో మరో భవనం కూలిపోయింది. నొయిడాలోని 63వ సెక్టార్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం అందుతోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఒకే వారంలో మూడు భవనాలు నేలకొరగడంతో భవన నిర్మాణాల్లో పాటిస్తున్న నాణ్యతపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.