యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం
డబుల్ డెకర్ ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఢీకొన్ని ఘటనలో 14 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని భడాన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సైఫాయి మిని పీజీఐకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
Also Read: రాంగ్ రూట్ జర్నీ.. పాపం గాల్లోకి ఎగిరిపడ్డాడు.. వైరల్ వీడియో
13 మంది హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విశ్వ దీపక్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి బిహార్ లోని మోతిహరికి వెళ్తున్న డబుల్ డెకర్ ప్రైవేట్ బస్సు.. ట్రక్కును వెనకనుంచి ఢీకొట్టినట్లు ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు. బాధితులకు వెంటనే మెడికల్, ఇతరత్రా సాయం చేయాలని.. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఉన్నతాధికారులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
Also Read: బీజేపీ 6 సీట్లు.. ఆప్ 1.. ఇలా కలిసొచ్చిందా?