రాంపూర్: అతి వేగంతో వెళ్తూ అదుపు తప్పిన ఓ బస్సు రోడ్డుపై వెళ్తున్న ఓ బైకుని ఢీకొని వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న నీళ్ల మడుగులోకి దూసుకెళ్లిన ఘటన ( Bus fell into mini gorge ) ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా అజీంనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. దీంతో పోలీసులు వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం బరేలీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తుగా నీటి మడుగు లోతుగా లేకపోవడంతో బస్సులోని ప్రయాణికులు వెనక కిటికీలోంచి క్షేమంగా బయటపడ్డారు. Also read : 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థానికుల సహాయంతో బస్సులోని ప్రయాణికులను రక్షించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ మేరకు స్వార్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ ప్రజాపతి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. Also read :