ICAI CA: సీఏ మే పరీక్షలు రద్దు. నవంబర్ లో నిర్వహణకు నిర్ణయం
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెట్ ఎక్కైంటెంట్స్ ఆఫ్ ఇండియా ( The Institute of Charted Accountants of India ) ( ( ICAI ) మే, జూలైలో జరగాల్సిన ఐసీఏఐ సీఏ పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ లో జరిగే పరీక్షలతో కలిపి ఈ పరీక్షల్ని నిర్వహించనున్నట్టు ఐసీఏఐ ప్రకటించింది.
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెట్ ఎక్కైంటెంట్స్ ఆఫ్ ఇండియా ( The Institute of Charted Accountants of India ) ( ( ICAI ) మే, జూలైలో జరగాల్సిన ఐసీఏఐ సీఏ పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ లో జరిగే పరీక్షలతో కలిపి ఈ పరీక్షల్ని నిర్వహించనున్నట్టు ఐసీఏఐ ప్రకటించింది.
కరోనా మహమ్మారి ( corona pandemic ) కారణంగా మే 3 న జరగాల్సిన సీఏ పరీక్షల్ని( CA Exams ) జూలై 29-ఆగస్టు 16 కు ( July 29-Aug 16 ) వాయిదా వేశారు. కానీ కరోనా సంక్రమణ ఇంకా పెరుగుతుండటంతో మరోసారి ఈ పరీక్షల్ని వాయిదా వేయకుండా..నేరుగా మే షెడ్యూల్డ్ పరీక్షలు రద్దు చేసింది ఐసీఏఐ( ICAI ) . ప్రతియేటా నవంబర్ నెలలో ( November scheduled ) జరిగే పరీక్షలతో మే లో జరగాల్సిన పరీక్షల్ని నిర్వహించనున్నట్టు ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. Also read: NEET, JEE EXAMS 2020: జేఈఈ, నీట్ పరీక్షలు సెప్టెంబర్ వరకు వాయిదా
తాజా పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్ధుల భవిష్యత్, ఆసక్తి దెబ్బతినకుండా మే పరీక్షల్ని నవంబర్తో కలిపి నిర్వహించేందుకు ఐసీఏఐ( ICAI ) నిర్ణయించింది. ఇప్పటికే మేలో పరీక్షలలకు చెల్లించిన ఫీజులు నవంబర్ పరీక్షలు వర్తించనున్నాయి. ఈసారి విద్యార్ధులకు తాము రాయబోయే గ్రూప్ ఆప్షన్లను , సెంటర్లను మార్చుకోడానికి పూర్తి అవకాశముంటుంది. అయితే నవంబర్ పరీక్షలకు మరోసారి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. నవంబర్ 1 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. Also read: Plasma bank: ప్లాస్మా బ్యాంకు ఎలా ఉంటుంది ? ఎవరు అర్హులు ?
జూన్ 29న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ ( Ministry of Home Affairs ) వెలువరించిన గైడ్ లైన్స్ ప్రకారం విద్యాసంస్థలు, కాలేజీలు జూలై 31 వరకూ మూసివేసి ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆంక్షలు ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో పరీక్షల నిర్వహణకు సెంటర్లను కేటాయించడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని ఐసీఏఐ స్పష్టం చేసింది. Also read: China Dispute: భారత్ తోనే కాదు..18 దేశాలతో చైనాకు వివాదం