న్యూఢిల్లీ: సీఏఏ, ఎన్‌ఆర్‌సిలతో దేశ ప్రజల బతుకు కష్టాల పాలైందని, బీఎస్‌పి అధినేత్రి మాయావతి బీజేపీపై మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మ్యానిఫెస్టోల భ్రమల్లో ఓటర్లు పడరాదని ఆమె విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ర్యాలీని ఉద్దేశిస్తూ ఆమె ప్రసంగించారు. తమ పార్టీ బీఎస్‌పి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఉత్తర ప్రదేశ్‌ను తీర్చి దిద్దినట్టు తాము ఢిల్లీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ సిద్ధాంతంపై అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు సోమవారం తూర్పు ఢిల్లీలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విపక్షాలపై నిప్పులు చెరిగారు. సీలంపూర్‌, జామియా, షహీన్‌బాగ్‌ ఇలా రోజుల తరబడి జరుగుతున్న పౌర నిరసనలు కాకతాళీయంగా జరిగేవి కాదని, దీని వెనుక కుట్ర ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని మండిపడ్డారు. దేశాన్ని చీల్చే కుట్రతోనే రాజకీయ శక్తులు దుష్ట పన్నాగాలకు పాల్పడుతున్నాయని అన్నారు. విద్వేష రాజకీయాలతో దేశం ముందుకెళ్లదని, అభివృద్ధి విధానంతోనే దేశ రూపురేఖలు మారతాయని బీజేపీ విశ్వసిస్తోందన్నారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..