Kolkata Doctor case: వెస్ట్ బెంగాల్ లో ప్రభుత్వం ఫెయిల్.. ఆస్పత్రిలో విధ్వంసంపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
Kolkata Rg kar hospital: కోల్ కతాలో ఆగంతకులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో చేసిన బీభత్సంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనిపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దేశంలో దుమారం చెలరేగుతుంది.
Calcutta high court slams Bengal govt on Kolkata RG Kar hospital vandalism: పశ్చిమ బెంగాల్ లోని ఆర్ జీ కర్ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై కలకతా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వందల మంది దుండగులు ఆస్పత్రిలో చేరుకుని విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతంలో ఆస్పత్రిలో ఎంత మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, ఆస్పత్రిలో వివరాలు తమకు తెలపాలని సూచించింది. దుండగులు క్రైమ్ సీన్ లో.. ఎవిడెన్స్ లను చెరిపేయలేదని మీరు చెప్పగలరా.. అని పోలీసుల మీద ప్రశ్నల వర్షం సంధించింది.
అంతేకాకుండా.. ఆస్పత్రిలో దుండగులు.. ప్రవేశించిన తీరుపై కూడా అనేక ప్రశ్నలు సంధించింది. పోలీసులు పూర్తిగా దుండగుల్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని కూడా తెల్చిచెప్పింది. ఒక వైపు మెడికల్ విద్యార్థులు నిరసనలు తెలియజేస్తుంటే.. మరోవైపు కొంత మంది దుండగులు ముసుగులు వేసుకుని ఆస్పత్రిలో విధ్వంసం చేసినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. వందల మంది వచ్చి అల్లర్లు చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని, 144 సెక్షన్ ఎందుకుపెట్టలేదని కూడా ప్రశ్నించింది. పోలీసులు, ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యారని ధర్మాసనం సీరియస్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు తమ డ్యూటీనిఎలా చేస్తారని కూడా ధర్మాసనం ఆందోళనవ్యక్తం చేసింది.
మరోవైపు చనిపోయినవైద్యురాలి తరపు లాయర్ మాట్లాడుతు.. దుండగులు క్రైమ్ సీన్ జరిగిన రూమ్ కోసం వెతికారని, కానీ వారు అక్కడికి వెళ్లలేకపోయారని వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసులు పూర్తిగా ఏంచేయలేదని అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. క్రైమ్ సీన్ లోని ఎవిడెన్స్ తారుమారుకాలేదని విషయంను తెలిపే ఫోటోలు తమకు చూపించగలరా.. అని కోర్టు ప్రశ్నించింది. మరోవైపు ఆగంతులు అర్ధరాత్రి ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ప్రవేశించి.. ఫర్నీచర్, ఆస్పత్రిలో అన్ని చోట్లో వస్తువులు చిందరవందరగా పాడేశారు. వాహానాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భాష్పవాయువు కూడా ప్రయోగించారు.
ఈఘటనలో ఇప్పటి దాక పోలీసులు 19 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండించింది. దీనిపై దేశ వ్యాప్తంగా ఒక రోజు అంటే ఆగస్టు 17 న బంద్ కూడా చేపట్లి , నిరసనలకు పిలుపునిచ్చింది. అదే విధంగా ఈ ఘటనపై మమతా బెనర్జీ ఈ రోజు సాయత్రం.. నిందితులకు డెట్ పనిష్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మమతార్యాలీ చేరపట్టనున్నట్లు తెలుస్తోంది.
Read more: Viral Video: వామ్మో.. బెడ్ రూమ్ లో కింగ్ కోబ్రా హల్ చల్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..
ఆదివారంలోగా.. కేంద్ర సంస్థ దర్యాప్తు పూర్తి చేయాలని మమతా అర్టిమేటం జారీ చేశారు. మరోవైపు కోల్ కతా పోలీసులు.. 90 శాతం దర్యాప్తును పూర్తిచేశారని మమతా వెల్లడించారు. ప్రస్తుతం ఈఘటనపై మోదీ ఏకంగా ఎర్రకోటపై నుంచి ప్రసంగంలో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. దేశంలో ఈ ఘటనపై నిరసలు మిన్నంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి