Canara Bank Recruitment: కెనరా బ్యాంక్ ఇటీవలే అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, జూనియర్ ఆఫీసర్‌తో సహా అనేక పోస్టులకు రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడా దరఖాస్తుకు చివరి తేదీ దగ్గర పడింది. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు మే 20వ తేదీలోపు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. కెనరా బ్యాంక్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 12 పోస్టులకు ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ గురించి వివరంగా తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెనరా బ్యాంకులో ఖాళీల వివరాలు..


డిప్యూటీ మేనేజర్ (బ్యాక్ ఆఫీస్) - 2 పోస్టులు


అసిస్టెంట్ మేనేజర్ (బ్యాక్ ఆఫీస్) - 2 పోస్టులు


అసిస్టెంట్ మేనేజర్ (బ్యాక్ ఆఫీస్) - 1 పోస్ట్


జూనియర్ ఆఫీసర్ (బ్యాక్ ఆఫీస్) - 2 పోస్టులు


డిప్యూటీ మేనేజర్ (బ్యాక్ ఆఫీస్) - 2 పోస్టులు


జూనియర్ ఆఫీసర్ - 2 పోస్టులు


అసిస్టెంట్ మేనేజర్ - 1 పోస్ట్


అర్హత, వయోపరిమితి..


నోటిఫికేషన్ ప్రకారం.. 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ సాధించిన అభ్యర్థులు ఇందులోని కొన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా సంబంధిత ట్రేడ్స్‌మెన్ డిగ్రీ లేదా ఇతర పోస్టులలో డిప్లొమా పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి విషయానికొస్తే.. అభ్యర్థుల కనీస వయస్సు 22 ఏళ్లు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. మీరు నోటిఫికేషన్‌లో దీని గురించి మరింత సమాచారాన్ని చూడవచ్చు.


ఎంపిక ఎలా జరుగుతుంది!


దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, అభ్యర్థులు వారి మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఈ అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగం లభిస్తుంది.


ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు


ముందుగా అభ్యర్థులు canarabank.comలో కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. ఇక్కడ వారు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, దరఖాస్తు ఫారమ్‌ను పొందుతారు. దరఖాస్తు ఫారమ్ ప్రింట్ ఔట్ తీసుకుని, దాన్ని పూరించి, అన్ని పత్రాలతో పాటు ఇచ్చిన చిరునామాకు పంపండి. అభ్యర్థులందరూ ఫారమ్‌ను 
THE GENERAL MANAGER, 
HR DEPARTMENT, 
CANARA BANK SECURITIES LTD, 
7th FLOOR, MAKER CHAMBER III NARIMAN POINT, MUMBAI - 400021 చిరునామాకు పంపాలి.


Also Read: Gujarat Wall Collapse Tragedy: గోడ కూలిన ప్రమాదంలో 12 మంది మృతి.. సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో హాహాకారాలు


Also Read: 2 Buses Collide: సేలం జిల్లాలో రెండు బస్సుల ఢీ.. 40 మందికి గాయాలు (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook