న్యూ ఢిల్లీ: లాక్ డౌన్ ( Lockdown ) మే 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ( PM Modi`s video conference ) ద్వారా సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రాల్లో నెలకొన్ని పరిస్థితులు, చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపైనా ( Lockdown extension ) ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాట్లాడుతూ.. మే 12 నుంచి ఢిల్లీ నుంచి దేశం నలుమూలల రైళ్లు నడుపబోతున్నారని తెలిసిందని.. కానీ చెన్నైలో ఏరోజుకు ఆరోజు కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఆ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా ప్రధానిని కోరారు. మే 31 వరకు తమిళనాడులోకి విమానాలు, రైళ్లు రాకుండా చేయగలిగితేనే వైరస్‌ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తమిళనాడు సీఎం పళనిసామి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : దిల్ రాజు పెళ్లిపై అంత ఇంట్రస్ట్ ఎందుకంటే..


ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో లాక్ డౌన్ ని ఎత్తేస్తే.. వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని అన్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ని కొనసాగిస్తేనే బాగుంటుందని సూచించారు. 


ఇదే విషయమై పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రధాని మోదీతో మాట్లాడుతూ.. ఒకవైపు లాక్‌డౌన్‌‌ని పకడ్బందీగా అమలు చేస్తూనే.. మరోవైపు ఆర్థిక వ్యవస్థను పునురుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే వారి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కెప్టేన్ అమరిందర్ సింగ్ గుర్తుచేశారు. 


Also read : రాష్ట్రంలో కొత్తగా 79 COVID-19 పాజిటివ్ కేసులు


ఇదిలావుంటే, కేరళ సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ.. సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యం దెబ్బతినకుండా నిబంధనలు పాటిస్తూనే రోడ్డు రవాణా, రైళ్లు, విమానాల రాకపోకలను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే రాష్ట్రంలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సు సర్వీసులకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 


Also read : రేపటికల్లా నగదు మీ ఖాతాల్లో పడుతుంది


ఓవైపు తమిళనాడు సీఎం పళనిసామి తన రాష్ట్రంలోకి రైళ్లు, విమానాలు రాకుండా చూడాల్సిందిగా కోరుతుండగా.. మరోవైపు అదే తమిళనాడుతో సరిహద్దులను పంచుకుంటున్న కేరళ సీఎం పినరయి విజయన్ మాత్రం అన్ని రకాల రవాణా సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఆ రాష్ట్రంలోకి రైళ్లు వెళ్లకుండా చూడాలంటే, తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల మీదుగానే రైళ్లను కేరళకు మళ్లించాల్సి ఉంటుంది. అయితే, డిస్టన్స్ పరంగా ఇది ఎంతో అసౌకర్యంతో పాటు ఖర్చుతోనూ కూడుకున్న విషయం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎవరి వైపు మొగ్గుతారు ? లేదంటే అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కోరినట్టుగా మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ విధిస్తారా ? అనేదే ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..