Everest Masala : సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సి ఎఫ్ ఎస్) వారు తాము పరిశీలించిన వివిధ మసాల పొడులలో ఇథైలిన్ ఆక్సైడ్ పురుగుల మందు ఉంది అని ప్రకటించారు. ఏప్రిల్ 5న ఈ ప్రకటన బయటకు వచ్చింది. ప్రజలు తక్షణమే ఈ పదార్థాలను వాడటం ఆపేయాలని ఎవరెస్టు వారు కూడా ఈ పౌడర్లను అమ్మడం తక్షణమే ఆపివేయాలని ఆర్డర్లు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన భారతదేశం మసాలాలకు బాగా ప్రసిద్ధి చెందింది. మన కల్చర్ లోనూ, చరిత్ర లోను ఆహార పదార్థాలలో ఉండే మసాలాలు అవి ఆహారానికి తెచ్చే ఫ్లేవర్లు ఫారినర్ లని కూడా ఆకర్షిస్తాయి. ఈ నేపథ్యంలోనే చాలా దేశాలు భారతదేశం నుండి మసాలా పొడులను దిగుమతి చేసుకుంటూ ఉంటాయి.


అన్ని దేశాల్లోనూ బాగా పాపులర్ అయిన మన మసాలాలను గ్లోబల్ ఫుడ్ కంట్రోల్ అధికారులు వివిధ రకాలుగా క్వాలిటీ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఇథలీన్ ఆక్సైడ్ అనేది ఒక కలర్ లేని ఫ్లేమబుల్ గ్యాస్. ఇది ఒక పురుగుల మందుగా కూడా వ్యవసాయంలో వాడుతూ ఉంటారు. హెల్త్ కేర్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా కొంతవరకు దీని పాత్ర ఉంటుంది. 


చాలా శాతం ఆహార పదార్థాల్లో ఇథైలిన్ ఆక్సైడ్ అనేది పొడి పదార్థాలలో పురుగులు రాకుండా మైక్రోబియల్ కంటామినేషన్ జరగకుండా ఉండడానికి వాడతారు. ఎక్కువ కాలం పురుగులు పట్టకుండా ఫంగస్ చేరకుండా ఈ ఇథైలిన్ ఆక్సైడ్ పనిచేస్తుంది. కానీ ఇది ఒక హైలీ రియాక్టివ్ కాంపౌండ్ అని ఎన్నో ఆరోగ్య కేంద్రాలు పేర్కొన్న పేర్కొన్నాయి. 


ఎక్కువ కాలం పాటు ఇథైలిన్ ఆక్సైడ్ ఉన్న ఆహారం తింటే మన ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం ఉంటుంది. ఒక్కసారి తింటే ఏమీ కాకపోవచ్చు కానీ తినాల్సిన మోతాదులో కంటే ఎక్కువ ఈ ఇథైలిన్ ఆక్సైడ్ ను తింటే శ్వాస ఇబ్బందులు, చర్మానికి చెందిన రోగాలతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇథైలిన్ ఆక్సైడ్ అనేది ఎక్కువ మోతాదులో మన శరీరంలోకి వెళ్లకుండా చాలా దేశాలు దీని వాడకాన్ని చాలా లిమిట్ చేసేసారు. 


సీ ఎఫ్ ఎస్ వారు ఎవరెస్ట్ బ్రాండ్ కి సంబంధించిన మూడు పొడులను రొటీన్ ఫుడ్ సర్విలేన్స్ లో భాగంగా పరీక్షించారు. కానీ అందులో ఎథలీన్ ఆక్సైడ్ పురుగుల మందు ని కనుగొన్నారు. దీంతో వెంటనే ఆ ప్రోడక్ట్స్ ను రీ కాల్ చేయవలసిందిగా పేర్కొన్నారు. 


గ్రూప్ వన్ పురుగుల మందులలో ఇథైలిన్ ఆక్సైడ్ కూడా ఒకటి. దానివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వారు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆహారంలో పురుగుల మందు ఉన్నప్పటికీ దాని మోతాదు మనుషుల మీద ఎటువంటి ప్రభావం చూపించకూడదని అలాంటప్పుడే ఆ ఫుడ్ ని యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తే 50 వేల డాలర్ల దాకా ఫైన్ తో పాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. 


మరోవైపు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ కూడా ఎవరెస్ట్ వారి ఫిష్ కర్రీ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేసింది. అందులో ఇతరులను ఆక్సైడ్ మోతాదు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు .


అయితే ఎవరెస్ట్ వారి ప్రొడక్ట్స్ ని రీ కాల్ చేయడం ఇది మొదటిసారి కాదు 2023 జూన్లో కూడా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ వారు ఎవరెస్ట్ బ్రాండ్ కి చెందిన సాంబార్ మసాలా గరం మసాలా ప్యాకెట్లలో సాల్మన్ లో అనే ఒక బ్యాక్టీరియా కూడా ఉంది అని వారి ప్రొడక్ట్స్ ను రీ కాల్ చేశారు సాల్మన్ ఎల్లా బ్యాక్టీరియా రోగాలను కలగజేస్తుంది కడుపులో నొప్పి మోషన్స్ ఫీవర్ వామిటింగ్ వంటి వాటితో పాటు సాల్మనల్లో బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి


Also Read: Cash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter