Supreme Court: కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించాల్సిందే..
కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన రూ.50 వేల పరిహారాన్ని ఏ రాష్ట్రం కూడా ఇవ్వకుండా నిరాకరించరాదని కోర్టు స్పష్టం చేసింది.
Supreme Court: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం(Covid death compensation) అందించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొవిడ్(Covid-19)తో చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం లేకున్నా పరిహారం అందించాలని ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని పేర్కొంది.
కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన రూ.50 వేల పరిహారాన్ని ఏ రాష్ట్రం కూడా ఇవ్వకుండా నిరాకరించరాదని కోర్టు స్పష్టం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రంలో కరోనా(Corona)తో చనిపోలేదని పేర్కొనడాన్ని ఇందు కోసం కారణంగా చూపరాదని తెలిపింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించిన మార్గదర్శకాలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
Also Read: UP Violence: కేంద్ర మంత్రి కుమారుడిపై మర్డర్ కేసు నమోదు..
ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక సూచనలు చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం అప్పటికే జారీ చేస్తే దానిలో మార్పుల కోసం బాధితులు సంబంధిత విభాగం వద్దకు వెళ్లొచ్చని సూచించింది. ఈ పథకానికి సంబంధించి మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి