పాట్నా: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా కోర్టులో కేసు నమోదైంది. శుక్రవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డారని, ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది చీఫ్ జుడీషియల్ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. భారత్‌తో అణుయుద్ధం తప్పదంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఓఝా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఇమ్రాన్ ఖాన్ ఉపయోగించిన పదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసిన ఓఝా.. భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.