Banks కస్టమర్లకు ఆ ఛార్జీలు తిరిగివ్వాల్సిందే
కస్టమర్ల వద్ద నుంచి వసూలు చేసిన యూపీఐ, డిజిటల్ నగదు చెల్లింపుల ఛార్జీల (Refund UPI charges)ను తిరిగి ఇచ్చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులకు సర్క్యూలర్ జారీ చేసింది.
న్యూఢిల్లీ: యూపీఐ, డిజిటల్ విధానాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీల (UPI Transaction Charges)ను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) బ్యాంకులను ఆదేశించింది. రూపే, భీమ్ యూపీఐ, యూపీఐ క్యాఆర్ కోడ్ సహా ఇతర డిజిటల్ విధానాలలో ఈ ఏడాది జనవరి 1 నుంచి వసూలూ చేసిన ఛార్జీలను తిరిగిచ్చేయాలని ఆగస్టు 30న ఓ సర్క్యూలర్ జారీ చేసింది. Gold Price: మళ్లీ తగ్గిన బంగారం ధరలు, వెండి పైపైకి
డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించడానికే కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫైనాన్స్ యాక్ట్ 2019లో సెక్షన్ 269 ఎస్‌యూను, సెక్షన్ 10ఏ ను ఐటీ యాక్ట్‌లోనూ చేర్చినట్లు గుర్తు చేసింది. దీని ప్రకారం రూపే, భీమ్ యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయకూడదని పేర్కొన్నారు. కానీ కొన్ని బ్యాంకులు ఇంకా ఆ విధానాల్లో డిజిటల్‌గా చెల్లించిన వారి వద్ద నుంచి ఛార్జీలు చేయడాన్ని సీబీడీటీ తప్పుపట్టింది. ప్రస్తుతం జనవరి 1 నుంచి వసూలు చేసిన ఛార్జీలు తిరిగివ్వడంతో పాటు భవిష్యత్‌లోనూ వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. Meera Mitun Hot Stills: నటి మీరా మిథున్ ఫొటోలు ట్రెండింగ్
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి