GVK గ్రూప్ చైర్మన్‌పై సీబీఐ కేసు.. వందల కోట్ల చీటింగ్!
CBI books GVK Group chairman | నిధుల దుర్వినియోగం, పనులు చేసినట్లుగా దొంగ లెక్కలు చూపించారన్న ఆరోపణలతో జీవీకే సంస్థపై చీటింగ్ కేసు నమోదైంది. జీవీకే చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
జీవీకే గ్రూప్‌పై సీబీఐ అధికారులు కేసు (CBI Files Case Against Gvk Group) నమోదు చేశారు. జీవీకే గ్రూప్ చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి (Venkata Krishna Reddy Gunupati), ఆయన కుమారుడు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ అయిన జి.వి. సంజయ్ రెడ్డి (GV Sanjay Reddy) తదితరులపై చీటింగ్ కేసు నమోదైంది. అవకతవకలకు పాల్పడి రూ.705 కోట్లు అక్రమంగా ఆర్జించారన్న ఆరోపణలతో సీబీఐ అధికారులు జీవీకే సంస్థపై, యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ‘పోలీసు కస్టడీ డెత్’ కేసులో మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్
ముంబై ఎయిర్ పోర్ట్ అభివృద్ధి, రెగ్యూలర్ నిర్వహణ, ఇతరత్ర పనులను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డిండ్ లిమిటెడ్(Gvk Group)కు అప్పగించింది. ఏప్రిల్ 4, 2006లో ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా ముంబై ఎయిర్ పోర్ట్ డెవలప్‌మెంట్ కోసం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో తప్పుడు మార్గంలో రూ.705 కోట్లు ఆర్జించారనే కారణంతో సీబీఐ కేసు నమోదు చేసింది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
తమకు అప్పగించిన పనిని మరో 9 కంపెనీల సాయంతో చేసినట్లుగా చూపించి రూ.310 కోట్లు అక్రమంగా ఆర్జించిందని ఆరోపణలున్నాయి. వీటితో పాటు మరో రూ.395కోట్లను తమ సంస్థకు, తమ వ్యక్తిగత పనులకు వినిగియోగించారని సీబీఐ ఆరోపిస్తోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!