లాలూపై కొనసాగుతున్న న్యాయమూర్తి జోక్స్
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కి దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష పడిన సంగతి మనకు తెలిసిన విషయమే.
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కి దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష పడిన సంగతి మనకు తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో ఆయనను కలవడానికి చాలా ఎక్కువమంది పార్టీ వ్యక్తులు, బంధువులు జైలుకి రావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను కలవడానికి వారానికి కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి ఇవ్వాలని సీబీఐ మెజిస్ట్రేట్ శివపాల్ సింగ్ తెలిపారు.
అయితే న్యాయమూర్తి తన నిర్ణయాన్ని పునరాలోచిస్తే బాగుంటుందని లాలూ వినతిపత్రాన్ని అందించారు. ‘పొంగల్ మా ఇంట్లో ప్రత్యేకమైన పండుగ. దహీ చురా అనేది బిహార్‌లో ప్రత్యేకమైన వంటకం. నాకు అది తినాలని ఉంది. బహుశా ఆ రోజు నా బంధుమిత్రులు ఎక్కువ మంది రావచ్చు. కానీ మీరు ముగ్గురికే పర్మిషన్ ఇచ్చారు. దయచేసి మీ నిర్ణయాన్ని పునరాలోచించండి’ అని ఆయన న్యాయమూర్తికి విన్నవించారు.
అయితే దానికి న్యాయమూర్తి కూడా దీటైన జవాబే ఇచ్చారు. "మీరు తినాల్సిన దహీచురాని కావాలంటే మీ ఇంటి నుండే తెప్పిస్తాను. కానీ ముగ్గురికి మించి ఎక్కువ మంది జైలులోకి రావడానికి వీల్లేదు" ఆయన కరాకండీగా చెప్పారు.
అలాగే తాను న్యాయవాదినని తెలిసి కూడా మూడున్నరేళ్లు శిక్ష విధించారని అడిగిన లాలూ ప్రశ్నకు కూడా న్యాయమూర్తి సమాధానం ఇచ్చారు. "అవునా.. నువ్వు లాయర్‌వా.. మరి నువ్వు నీ రిజిస్ట్రేషన్ నెంబర్ నాకు చెప్పాలి కదా. నువ్వు చెప్పలేదు కాబట్టే.. నీకు మూడున్నరేళ్లు శిక్ష వేశాను’ అని ఆయన తెలిపారు