CBI Raids: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను వదల బొమ్మాళీ అన్నట్లుగా వెంటాడుతోంది సీబీఐ. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో సీబీఐ అధికారుల సోదాలు చేస్తున్నారు. పాట్నాతో పాటు దేశ వ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. ఆ సమయంలో జరిగిన ఉద్యోగాల భర్తీలో అవకతవతలు జరిగాయని, లాలూ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారనే  ఆరోపణలు వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది.  రైల్వే ఉద్యోగాల భర్తీలో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఉద్యోగం వచ్చేలా చూస్తామంటూ నిరుద్యోగుల నుంచి భూములు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలోనే తాజాగా లాలూపై సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూతో పాటు అతని కుమార్తెలు అవినీతికి పాల్పడ్డారని ప్రాధమిక విచారణలో తేలడంతో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది.


దేశవ్యాప్తంగా సంచలనమైన దాణా స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇటీవలే బెయిల్ వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పశువుల దాణా కుంభకోణానికి పాల్పడినట్టు రుజువు కావడంతో లాలూకు జైలు శిక్ష పడింది. ఐదు కేసుల్లో దోషిగా తేలిన లాలూకు.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష, 60 లక్షల  రూపాయల జరిమానా విధించింది. అయితే అనారోగ్య కారణాలతో గత నెలలో ఝార్కండ్ హైకోర్టు లాలూకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై బయటికి వచ్చిన లాలూపై ఇప్పుడు మరో కేసు నమోదు కావడంతో ఆర్జేడీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 


READ ALSO: Dead Body In MLC Car: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం.. కొట్టి చంపారనే ఆరోపణలు


READ ALSO:Migrant labourers Killed: రోడ్డు పక్కన నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన ట్రక్కు.. హర్యానాలో నలుగురు దుర్మరణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook