దేశంలో విపక్షాల్ని టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐటీ, సీబీఐ, ఈడీ అస్త్రాలు ఒక్కొక్కటిగా సంధిస్తోందని ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో సంచలనంగా మారిన ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ కుటుంబసభ్యులకు కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. 


వాస్తవానికి తేజస్వి యాదవ్‌ను సీబీఐ మార్చ్ 4వ తేదీనే విచారణకు పిలిచింది. అయితే ఆ రోజున హాజరుకాకపోవడంతో మార్చ్ 11న హాజరు కావల్సిందిగా కోరినట్టు సీబీఐ తెలిపింది. అయితే తేజస్వి యాదవ్ విచారణకు హాజరు కాలేదని తెలుస్తోంది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని తేజస్వి యాదవ్ నివాసాల్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, పాట్నా, రాంచీ, ముంబై సహా 24 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. 


ఇదే కేసులో సీబీఐ ఇటీవలే ఢిల్లీలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను, ఆయన భార్య రబ్రీదేవిని పాట్నాలో విచారించింది. రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం కొందరిని లంచంగా పొందారనే ఆరోపణలతో ల్యాండ్ ఫర్ జాబ్ కేసు నమోదైంది. ఇందులో మొత్తం 12 మందిపై కేసు నడుస్తోంది. 2022 మే నెలలో లాలూ ప్రసాద్, రబ్రీదేవి, ఇద్దరు కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌లపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగాలు ఇప్పించేందుకు భూములు తీసుకున్నారనేది సీబీఐ ఆరోపణ.  రైల్వేలో గ్రూప్ డీ పోస్టుల భర్తీ విషయంలో ఈ అవినీతి జరిగిందని సీబీఐ తెలిపింది. సీబీఐ సమన్లు అందుకున్న తేజస్వి యాదవ్ ఇంకా విచారణకు హాజరు కాకపోవడంతో సీబీఐ ఏం చర్యలు తీసుకుంటుందో ఆసక్తిగా మారింది. 


Also read: AP BJP: బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్న మాజీ ముఖ్యమంత్రి, ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook