దేశంలో సంచలనం సృష్టించిన సీబీఐ వివాదం అనంతరం ఆ విభాగంలో పనిచేస్తోన్న అధికారుల్లో సుమారు 150 మందికిపైగా అధికారులకు కేంద్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణలో సిద్ధహస్తుడిగా పేరున్న శ్రీ శ్రీ రవిశంకర్ సీబీఐ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. అధికారుల్లో పరస్పరం సమన్వయం కొరవడిన నేపథ్యంలో వారి మధ్య పనిచేసే వాతావరణాన్ని కల్పించడం కోసమే కేంద్రం ఈ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్టు సీబీఐ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. రేపు శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ తరగతులు మూడు రోజుల పాటు జరగనున్నాయి.


[[{"fid":"175749","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Art-of-living-classes-for-CBI-officials","field_file_image_title_text[und][0][value]":"సీబీఐ అధికారులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ ఇవ్వనున్న శ్రీ శ్రీ రవి శంకర్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Art-of-living-classes-for-CBI-officials","field_file_image_title_text[und][0][value]":"సీబీఐ అధికారులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ ఇవ్వనున్న శ్రీ శ్రీ రవి శంకర్"}},"link_text":false,"attributes":{"alt":"Art-of-living-classes-for-CBI-officials","title":"సీబీఐ అధికారులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ ఇవ్వనున్న శ్రీ శ్రీ రవి శంకర్","class":"media-element file-default","data-delta":"1"}}]]