CBSE Board Exam: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో మార్పు, కొత్త షెడ్యూల్ ఇలా
CBSE Board Exam: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ మారింది. కొత్త టైమ్ టేబుల్ ప్రకారం కొన్ని పరీక్షల తేదీల్లో మార్పు వచ్చింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ నుంచి కొత్త టైమ్ టేబుల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CBSE Board Exam: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతుల పరీక్షల తేదీని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు తాజాగా షెడ్యూల్ రివైజ్ చేసింది. కొన్ని పరీక్షల్లో మార్పులు రావడంతో డేట్ షీట్ మార్చింది. ఈ ఏడాదిలో 10, 12 వ తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులు కొత్త టైమ్ టేబుల్ సరి చూసుకోవల్సి ఉంటుంది.
సీబీఎఎస్ఈ 10,1 2వ తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. కొత్త టైమ్ టేబుల్ ప్రకారం మార్చ్ 4 న జరగాల్సిన టిబెటన్ పరీక్ష పదిరోజులు ముందే అంటే ఫిబ్రవరి 23 న జరగనుంది. రిటైల్ సబ్జెక్ట్ పరీక్ష ఫిబ్రవరి 16న జరగాల్సి ఉండగా కొత్త టైమ్ టేబుల్ ప్రకారం ఫిబ్రవరి 26న జరగనుంది. అదే విధంగా 12వ తరగతికి సంబంధించి ఫ్యాషన్ స్టడీస్ పరీక్ష మార్చ్ 11న జరగాల్సి ఉండగా ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చ్ 21న జరగనుంది.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ ఇలా ఉండనుంది. 10వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ 13 వరకూ జరుగుతాయి. ఇక 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరగనున్నాయి.
Also read: Ayodhya Flights: జనవరి 15, 17 నుంచి అయోధ్యకు ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు, టైమింగ్స్ ఇవీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook