CBSE Announces Class 12 Result 2022: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12th results 2022) శుక్రవారం రిలీజ్ అయ్యాయి. ఈ మేరకు నేటి ఉదయం సీబీఎస్ఈ బోర్టు ఫలితాలను వెల్లడించింది. విద్యార్థులు రోల్ నంబర్, పాఠశాల నంబర్‌లను ఉపయోగించి cbse.gov.in, results.cbse.nic.in వెబ్‌సైట్‌లలో స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు డిజిలాకర్‌, పరీక్షా సంగమ్‌ నుంచి కూడా  రిజల్ట్ ను  చూసుకోవచ్చు. ఈ సంవత్సరం 12వ తరగతిలో మొత్తం 92.71% మంది ఉత్తీర్ణత సాధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022 టర్మ్ 1, 2 పరీక్షలు రెండింటిలోనూ మార్కుల వెయిటేజీ ఆధారంగా  సీబీఎస్ఈ ఫైనల్ మార్క్ షీట్ తయారు చేయబడింది. విద్యా సంవత్సరంలో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు, ప్రాజెక్ట్ వర్క్‌లు, ప్రాక్టికల్ పరీక్షలు మరియు ప్రీ-బోర్డ్ ఎగ్జామ్స్‌గా పొందిన మార్కుల ఆధారంగా స్కోర్ కార్డును రూపొందిస్తారు.  సీబీఎస్ఈ  టర్మ్ 2 పరీక్ష ఏప్రిల్ 26 మరియు జూన్ 4 మధ్య జరిగింది. 


సీబీఎస్ఈ 2021-22 అకడమిక్ సెషన్ కోసం రెండు టర్మ్‌లలో పరీక్షలను నిర్వహించింది. నవంబర్-డిసెంబర్ 2021లో జరిగిన  టర్మ్ 1 బోర్డు పరీక్షలు మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలతో  నిర్వహించారు.  అయితే టర్మ్ 2 పరీక్షలు విశ్లేషణాత్మక మరియు కేస్ ఆధారిత ప్రశ్నలతో నిర్వహించారు.  


Also Droupadi Murmu Becomes President: రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ముRead: 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook