Dry Swab Test: కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇకపై మరింత వేగవంతం కానున్నాయి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కొత్త రకం డ్రైస్వాబ్ టెస్ట్ కిట్లను అభివృద్ది చేశాయి. ఇక రోగ నిర్ధారణ మరింత వేగవంతం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ కచ్చితమైన నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ పరీక్ష(RTPCR Test)పై ఆధారపడుతున్నాం. అయితే ఇందులోంచి ఆర్ఎన్ఏను వేరు చేసి..రోగ నిర్ధారణ చేసేందుకు చాలా సమయం పడుతోంది. ఫలితం తేలడానికి ఒక్కోసారి 1-2 రోజులు పట్టేస్తోంది. ఈ నేపధ్యంలో సీసీఎంబీ కొత్త రకం కిట్లను అభివృద్ధి చేసింది. డ్రైస్వాబ్ టెస్ట్ కిట్లను రూపొందించింది. వీటితో ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఇకపై వేగంగా..చౌకగా జరగనున్నాయి. భారత వైద్య పరిశోధన సమాఖ్య ఈ కిట్ల వినియోగానికి అనుమతిచ్చింది. ఈ కిట్లను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు మెరిల్ డయాగ్నస్టిక్స్(Meril Diagnostics) ముందుకొచ్చింది. 


డ్రైస్వాబ్ పరీక్ష కిట్ల ద్వారా తక్కువ సమయంలోనే రోగ నిర్ధారణ చేయవచ్చు. నెలకు రెండు కోట్ల డ్రైస్వాబ్ టెస్ట్ కిట్లను(Dry Swab Test kits) ఉత్పత్తి చేస్తామని..ఒక్కో పరీక్షకు కేవలం 45-60 రూపాయల ఖర్చవుతుందని మెరిల్ డయాగ్నస్టిక్స్ సంస్థ వెల్లడించింది. ఈ కిట్లతో  దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ పరీక్షలకు 2-3 రెట్లు ఎక్కువగా చేయవచ్చు. పరీక్షలకు అయ్యే సమయం, ఖర్చు దాదాపు సగం తగ్గుతుందని తెలుస్తోంది. కోవిడ్ వ్యాధి నిర్ధారణకు ముక్కు లేదా నోటి లోపల ఉండే ద్రవాల్ని పొడుగైన కాటన్‌తో సేకరిస్తారు. ఆర్టీపీసీఆర్ నమూనా కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ఈ స్వాబ్‌ను వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం ద్రావణంలో ఉంచాల్సి ఉంటుంది. ఇందులోని జీవ పదార్ధాన్ని జాగ్రత్త పర్చేందుకు కొన్ని రీఏజెంట్లను వాడుతారు. సీసీఎంబీ (CCMB)అభివృద్ది చేసిన టెస్ట్ కిట్లతో అయితే స్వాబ్‌ను పొడిగానే తీసుకెళ్లవచ్చు.కేవలం మూడు గంటల్లోనే ఫలితం తెలిసిపోతుంది. 


Also read: Supreme Court: దేశంలో వ్యాక్సినేషన్ విధానం సరిగ్గా లేదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook