last rites of Chief of Defence staff General Bipin Rawat: తమిళనాడులోని నిలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో దుర్మరణం (Army Helicopter Crash) పాలైన సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికా అంత్యక్రియలు శుక్రవారం (Bipin Rawat’s final rites) జరగనున్నాయి. ఈ మేరకు అధికారిక వర్గాలు సమాచారమిచ్చాయి. ఇవాళ సాయంత్రం రావత్​ దంపతుల భౌతిక దేహాలను విమానాల్లో ఢిల్లీకి తరలించనున్నట్లు వెల్లడించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రావత్ దంపతులు సహా హెలికాపక్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆర్మీ అధికారుల భౌతికకాయాలు వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉంచారు. రావత్ దంపతుల భౌతిక దేహాలను కోయబత్తూర్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. అంతకు ముందు రావత్​కు తమిళనాడు సీఎం స్టాలిన్​, ఐఏఎఫ్ చీఫ్​ మార్షల్​ చౌధరీ నివాళులర్పించనున్నారు.


సందర్శనకు అనుమతి..


రేపు ఉదయం నుంచి సీడీఎస్​ బిపిన్ రావత్​ భౌతిక దేహాన్ని (CDS Bipin Rawat) చివరి చూపు చూసేందుకు ప్రజలను అనుమతించనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ కంటోన్మెంట్​లోని స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో అత్యక్రియలు నిర్వహించనున్నారు.


ఘటనా స్థలికి ఐఏఎఫ్​ చీఫ్​..


భారత వైమానిక దళం (ఐఏఎఫ్​) చీఫ్​ మార్షల్​ వి.ఆర్​.చౌధరి ఇవాళ ఉదయం.. హెలికాప్టర్​ ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. తమిళనాడు డీజీపీ సి.శైలేంద్ర బాబు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.


నిన్న (బుధవారం) జరిగిన ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్​ రావత్​ దంపతులతో పాటు (Helicopter crash near Coonoor) మొత్తం 13 మంది (ఆర్మీ అధికారులు, ఇతర సిబ్బంది) ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


Also read: BlackBox: బిపిన్ రావత్ హెలీకాప్టర్ బ్లాక్‌బాక్స్ ఎక్కడ, అందులో ఏముంది


Also read: General Naravane: తదుపరి సీడీఎస్​గా ఆర్మీ చీఫ్​ జనరల్ నరవాణే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook