Bipin Rawat funeral: భారత తొలి త్రిదళాధిపతి బిపిన్​ రావత్(CDS Bipin Rawat) దంపతుల అస్థికలను శనివారం ఉదయం ఉత్తరాఖండ్ హరిద్వార్(​Haridwar)లోని గంగానదిలో వారి కుమార్తెలు కృతిక, తరణి కలిపారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలోని బ్రార్​ స్క్వేర్​ శ్మశానవాటిక(Brar Square crematorium in Delhi)లో వారి అంత్యక్రియలను నిర్వహించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిల్లీ కంటోన్మెంట్​లోని బ్రార్​ స్క్వేర్​ శ్మశానవాటిక నుంచి రావత్​ దంపతుల చితాభస్మాల్ని శనివారం ఉదయం సేకరించారు ఆయన కుమార్తెలు క్రతిక, తరిణి. అక్కడి నుంచి నేరుగా ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​కు చేరుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అస్థికలను నదిలో కలిపారు.



Also Read: మా నాన్నే నా హీరో.. బెస్ట్ ఫ్రెండ్... లిద్దర్ శవపేటిక వద్ద కన్నీటిపర్యంతమైన కుమార్తె


డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం(Helicopter Crash)లో సీడీఎస్​ బిపిన్​ రావత్​ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం దిల్లీలోని బ్రార్​ స్క్వేర్​​లో అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు(Bipin Rawat funeral) జరిపారు.  త్రివిధదళాలు 17 శతఘ్నులను గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించారు. ఈ అంత్యక్రియల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌(Uttarakhand CM Pushkar Singh Dhami ), దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook