Bipin Rawat Last rites: సీడీఎస్ బిపిన్ రావత్ అత్యక్రియలు నేడు
Bipin Rawat Last rites: సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి అంత్యక్రియలు నేడు ఢిల్లీలో జరగనున్నాయి. ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
CDS General Bipin Rawat's funeral will take place today: తమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో (Bipin Rawat chopper crash) ప్రాణాలు కోల్పోయిన త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికాల అత్యక్రియలు నేడు (శుక్రకవారం) జరగనున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ స్మశానవాటికలో వీరికి అంతిమ సంస్కారాలు (CDS General Bipin Rawat's funeral) నిర్వహించనున్నారు.
ఆర్మీ అధికారిక లాంఛనాలతో వీరికి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
అంతిమ యాత్ర ఇలా..
జనరల్ బిపిన్ రావత్, మధులికా రావత్‌ల భౌతిక దేహాలను గురువారం సాయంత్రం తమిళనాడు నుంచి సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం వారి నివాసంలోనే భౌతిక దేహాలను ఉంచారు.
ఇక్కడ ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సాధారణ ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించనున్నారు.
ఆ తర్వాత రావత్ ఇంటి నుంచే అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. కామరాజ్ మార్గ్ ద్వారా కంటోన్మెంట్‌లోని స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఇప్పటికే ఈ మార్గంలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.
ప్రముఖుల నివాళి..
సీడీఎస్ బిపిన్ రావత్ సహా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారందరికి సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఐఏఎఫ్ చీఫ్ మర్షల్ వివేక్ చౌధరీ సహా పలువురు ప్రముఖులు తమిళనాడులో నివాళులర్పించారు.
ఢిల్లీకి చేరుకున్న తర్వాత పాలం ఎయిర్ బేస్‌లో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తో పాటు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో 11 మంది పార్థివదేహాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాళులర్పించారు.
ఆ తర్వాత ప్రధాని మోదీ (PM Modi pays tributes to CDS General Bipin Rawat) కూడా.. అమరులకు నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు.
ప్రమాదంలో ఇలా..
మొత్తం 14 మందితో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ (IAF chopper crash) బుధవారం మధ్యాహ్నం తమిళనాడు, నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలో కుప్ప కూలింది. ఇందులో మొత్తం 13 మంది మృతి చెందారు. ఒక్కరు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడగా.. ప్రస్తుతం ఆయనకు ఆర్మీ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన యావత్ భారతావనిని ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది.
ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై ఇప్పటికే ఐఏఎఫ్ సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. హెలికాప్టర్ బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు. త్వరలోనే ప్రమాదానికి కారణఆలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
Also read: Bipin Rawat's mortal remains: బిపిన్ రావత్ పార్థివదేహానికి PM Modi అంతిమ నివాళి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook