కేంద్ర ఎన్నికల కమిషన్ జయ వీడియో ఫుటేజీపై సీరియస్ అయ్యింది. వీడియో విడుదల అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని తమిళనాడు ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. మరోవైపు ఆర్కే నగర్ రిటర్నింగ్ అధికారి వీడియో ప్రాసారాలను ఆపేయాలని పత్రికలు, ఛానెళ్లను కోరారు. 


పన్నీరు సెల్వం వర్గం వీడియోపై స్పందించింది. ఎన్నికల్లో గెలుపొందటానికే దినకరన్ వర్గం ఈ వీడియోను విడుదల చేసిందని అన్నారు. ఇన్ని రోజులుగా వీడియోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.