DR Hike: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్, 53 శాతానికి పెరిగిన డీఆర్, ఎరియర్లతో సహా ఎంతంటే
DR Hike Updates in Telugu: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు శుభవార్త విన్పించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ అంటే డీఆర్ పెంచింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ 53 శాతమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DR Hike Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ 50 నుంచి 53 శాతమైంది. పెన్షనర్లకు పెరిగిన డీఆర్ జూలై 2024 నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన ద్రవ్యోల్బణం నుంచి పెన్షనర్లకు ఈ డీఆర్ బారీగా ఉపశమనం కల్గించనుంది. పెరిగిన డీఆర్ పెన్షనర్లకు ఏంత వస్తుందంటే..
కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. డియర్‌నెస్ రిలీఫ్ 50 నుంచి 53 శాతమైంది. పెరిగిన డీఆర్ జూలై నుంచి అమల్లో రానుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ల వెల్ఫేర్ డీఆర్ 53 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఆర్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు, కుటుంబీకులకు ప్రయోజనం కలగనుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ పెన్షనర్లు, కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. డిఫెన్స్ సర్వీస్ సివిలియన్ పెన్షనర్లు, ఆల్ ఇండియా సర్వీసెస్ పెన్షనర్లకు లాభం కలగనుంది. రైల్వే పెన్షనర్లు, తాత్కాలిక పెన్షన్ తీసుకునే పెన్షనర్లకు, బర్మా, పాకిస్తాన్ నుంచి వచ్చి ప్రభుత్వ పెన్షనర్లకు లబ్ది కలగనుంది.
జూలై నుంచి రావల్సిన డీఆర్ ఎరియర్లు లెక్కించి అక్టోబర్ నెలతో పాటు చెల్లించారు. రీ ఎంప్లాయ్డ్ ప్రభుత్వ పెన్షనర్లకు సీసీఎస్ 2021 నిబంధనల ప్రకారం డీఆర్ చెల్లిస్తారు. బ్యాంకులు, ఇతర సంస్థలు డియర్‌నెస్ రిలీఫ్ పూర్తిగా ఎరియర్లతో సహా అందుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.