Corona vaccine for Children: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో దశలో ప్రవేశించింది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక 15 ఏళ్లలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omcron)కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం రోజుకు దాదాపు 3 లక్షల కొత్త కేసులు నమోదవుతున్న పరిస్థితి. కరోనా సంక్రమణ, ఒమిక్రాన్ వేరియంట్ దృష్టిలో ఉంచుకుని ఇటీవల చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించింది కేంద్రం. ఇందులో భాగంగా తొలుత 15-18 ఏళ్ల వయస్సున్న చిన్నారులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. 


ఇక నుంచి అంటే మార్చ్ 12వ తేదీ నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ (Vaccination)ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మార్చ్ 12వ తేదీ నుంచి 12-15 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మార్చ్ 12వ తేదీలోగా 15-18 మధ్య చిన్నారుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దేశంలో 15-18 ఏళ్ల వయస్సున్న చిన్నారులు  7.4 కోట్లున్నారు. ఇప్పటికే వీరిలో 3.45 కోట్లమంది మొదటి డోసు తీసుకున్నారు.కోవాగ్జిన్ ఇస్తుండటంతో 28 రోజుల వ్యవధిలోనే రెండవ డోసు ఉంటుంది. మార్చ్ 12 వ తేదీ నుంచి మాత్రం 12-15 ఏళ్ల చిన్నారులకు సైతం కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Also read: Omicron Vaccine: ఒమిక్రాన్‌కు చెక్ పెట్టేందుకు త్వరలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి