Shot Ad Removed: వివాదాస్పదంగా మారిన యాడ్ తొలగించాలని కేంద్రం ఆదేశం
Shot Ad Removed: రేప్‌ను ప్రోత్సహించేలా ఉన్న ఓ డియోడ్రంట్ కంపెనీకి చెందిన యాడ్‌పై కేంద్రం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాలో ఈ యాడ్‌పై తీవ్ర విమర్శలు రావడంతో...సదరు అడ్వర్టైజ్మెంట్లను నిలిపివేసింది. ఈ మేరకు సమచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.
Shot Ad Removed: అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా మొబైళ్ల వాడకం పెరిగిపోవడం, పోర్న్ వెబ్‌సైట్లపై కంట్రోల్ లేకపోవడం వంటి కారణాలతో చిన్నతనంలోనే మృగాళ్లుగా మారుతున్నారు కొందరు ఆకతాయిలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడో డియోడ్రంట్ యాడ్ పెద్ద దుమారమే రేపింది. గుజరాత్‌కు చెందిన లేయర్ అనే కంపెనీ షాట్ అనే బాడీ స్ప్రే తయారుచేసింది. దీని ప్రమోషన్ కోసం అడ్వర్టైజ్‌మెంట్లు రిలీజ్ చేసింది. ఈ యాడ్స్ మహిళలను కించపర్చేలా ఉన్నాయని.. సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. యాడ్ రూపొందించే వారు ఎంచుకున్న విధానం రేప్ కల్చర్‌ను ప్రోత్సహించేలా ఉందని మహిళాసంఘాలు దుమ్మెత్తి పోశాయి.
షాట్ బాడీ స్ప్రే ప్రమోషన్ కోసం కంపెనీ ఎంచుకున్న యాడ్స్ తీరు మరీ నీచంగా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఒక యాడ్‌లో ఇద్దరు లవర్స్ ఓ రూంలో ఉంటారు. అక్కడకు వచ్చిన అబ్బాయి ఫ్రెండ్స్ షాట్ వేయాలని ఉందని అడుగుతారు. దానికి అబ్బాయి షాట్ వేస్కో అని పర్మిషన్ ఇస్తాడు. అప్పుడా అమ్మాయి షాక్‌కు గురికాగా.. అబ్బాయి ఫ్రెండ్‌లో ఒకడు బెడ్ పక్కన ఉన్న షాట్ బాడీ స్ప్రే తీసుకుంటాడు.
మరో యాడ్‌లో ఓ అమ్మాయి ఒంటరిగా సూపర్ మార్కెట్ వెళ్తుంది. అక్కడున్న నలుగురు అబ్బాయిలు డబల్‌మీనింగ్ డైలాగ్స్ వదుల్తారు. మేం నలుగురం ఉన్నాం... ఒక్కడ ఒకటే ఉంది షాట్ ఎవరేస్తారని ప్రశ్నిస్తారు. దీంతో ఆ అమ్మాయి భయపడిపోతోంది. అందులో ఒకడు షాట్ బాడీ స్ప్రేను తీసుకుంటాడు. దీంతో ఆమె రిలాక్స్ అవుతుంది. ఈ రెండు యాడ్స్ రేప్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నాయని.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి
సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలతో కేంద్రం చర్యలు చేపట్టింది. వెంటనే సదరు యాడ్స్ నిలిపివేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ లోనూ యాడ్స్ ను తొలగించాలని తెలిపింది. అటు ఢిల్లీ మహిళా కమిషన్ సైతం ఈ యాడ్స్ పై స్పందించింది. దీనిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను నోటీసులు జారీచేశారు కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివార్.
Also read : Bike Rider Video: అచ్చు జాన్ అబ్రహం మాదిరే.. పోలీసులను భలే బురిడీ కొట్టించిన బైక్ దొంగ!
Also read : Maggi Divorce Case: ప్రతిరోజూ మ్యాగీ పెడుతుందని.. భార్యకు విడాకులిచ్చిన భర్త! ట్విస్ట్ ఏంటంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి