Farmers tractor rally: దేశ గణతంత్ర దినోత్సవాన అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకమైంది. వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులపై దాడులు జరిగాయి. ఎర్రకోటను ముట్టడించి ఖల్సా ఫ్లాగ్ ఎగురువేశారు. ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రిపబ్లిక్ డే (Republic Day ) ఉత్సవాల రోజున దేశ రాజధాని నగరం ఢిల్లీ ( Delhi ) లో రైతులు ట్రాక్టర్ ర్యాలీ ( Tractor Rally ) చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్టాల ( New Farm Bills ) కు వ్యతిరేకంగా గత మూడు నెలల్నించి అన్నదాతల నిరసన ( Farmers protest ) ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోంది. నిరసనలో భాగంగా గణతంత్ర దినోత్సవాన భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారింది. పోలీసుల బ్యారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ దూసుకెళ్లింది ర్యాలీ. పోలీసులపై దాడులు, పోలీసు వాహనాలు , బస్సుల్ని ధ్వంసం చేశారు. ఎర్రకోటను ముట్టడించి ఖల్సా పతాకాన్ని ( Khalsa flag on redfort ) ఎగురవేశారు రైతులు. ఒక రైతు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేంద్రం సీరియస్ ( Centre serious ) ‌గా ఉంది. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. రిపబ్లిక్ డే నాడు హింసాత్మకంగా మారడానికి కారణమైనవారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తం 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి...20 మందికి నోటీసులు పంపించారు. 


ఉద్రిక్త పరిస్థితులకు వివరణ ఇవ్వాలని కోరుతూ 20 మంది రైతు సంఘ నేతలకు నోటీసులు ( Central government sent notices to farmer leaders ) పంపించారు ఢిల్లీ పోలీసులు ( Delhi Police ). కిసాన్ ర్యాలీలో పరిణామాలపై మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. రైతు సంఘ నేతలు యోగేంద్ర యాదవ్, బాల్‌దేవ్ సింగ్ సిర్సా, బల్బీర్ రాజేవాల్‌తో పాటు మరి కొంతమందికి ఈ నోటీసులు అందాయి. ఎర్రకోటపై జెండా ఎగురవేయడాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 


Also read: CBSE New Affiliation system: సీబీఎస్ఈ గుర్తింపు ప్రక్రియలో కీలక మార్పులు, ఇకపై అంతా ఆన్‌లైన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook