Corona Vaccination: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తికి భారీగా నిధుల్ని మంజూరు చేయడమే కాకుండా వ్యాక్సినేషన్ అర్హతల్ని మార్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ సెకండ్ వేవ్ (Corona Second Wave)రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రతిరోజూ 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2 లక్షల 73 వేల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపధ్యంలో కరోనా వ్యాక్సినేషన్‌కు (Corona vaccination) సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central government) కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ కట్టడి వ్యాక్సినేషన్ ఒక్కటే కీలకమని భావించి..ఆ దిశగా అడుగులేస్తోంది. వ్యాక్సిన్ ఇకపై 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ( Vaccine to above 18 years) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మే 1 నుంచి ఈ కొత్త నిర్ణయం అమలు కానుంది. 


మరోవైపు వ్యాక్సిన్ కోసం జనం క్యూలలో ఉంటున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు అయిపోయాయి. ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ సరఫరా చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరమని కంపెనీలు ఇప్పటికే కోరిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum institute), భారత్ బయోటెక్ కంపెనీలకు 4 వేల 5 వందల కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి కేంద్ర ఆర్ధిక శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. 3 వేల కోట్ల రూపాయల్ని సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు, 15 వందల కోట్ల రూపాయల్ని భారత్ బయోటెక్ ( Bharat Biotech) కంపెనీకు ఇవ్వనుంది. జూన్ నెలలోగా వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ అయితే నెలకు పది కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయనుంది.


Also read:  COVID-19 Lockdown: లాక్‌డౌన్ ప్రకటించగానే Wine Shopsకు మందుబాబులు పరుగులు, పలు ప్రాంతాల్లో భారీ క్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook