Petrol Prices, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం
Petrol Prices, Diesel Prices: హైదరాబాద్: దేశ ప్రజలకు కేంద్రం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలవుతున్న సామాన్యుడికి రిలీఫ్ ని ఇస్తూ పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది.
Petrol Prices, Diesel Prices: హైదరాబాద్: దేశ ప్రజలకు కేంద్రం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలవుతున్న సామాన్యుడికి రిలీఫ్ ని ఇస్తూ పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. లీటర్ పెట్రోల్ పై రూ. 8, లీటర్ డీజిల్ పై రూ. 6 సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 9.5 తగ్గనుండగా లీటర్ డీజిల్ ధర 7 రూపాయల మేర తగ్గనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కేంద్రంపై ఏడాదికి 1 లక్ష కోట్ల రూపాయల మేర రెవిన్యూ భారం పడనుంది.
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు మాత్రమే కాకుండా ఎల్పీజీ సిలిండర్ ధరల సైతం దిగిరానున్నాయి. అవును.. ఈ ఏడాది ఒక్కో సిలిండర్‌పై 200 రూపాయల వరకు సబ్సీడీ ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. రూ. 200 సబ్సీడీతో ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఇవ్వనున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు ఎల్పీజీ సిలిండర్ ధరల తగ్గింపు ఫలాలు అందనున్నాయి.
ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గిస్తూ కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం కారణంగా కేంద్రానికి వచ్చే ఆదాయంపై సుమారు రూ. 6,100 కోట్లు ప్రభావం పడనుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. ఎల్పీజీ సిలిండర్ల ధరలు (LPG Prices) తగ్గిస్తూ కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం కారణంగా కేంద్రానికి వచ్చే ఆదాయంపై సుమారు రూ. 6,100 కోట్లు ప్రభావం పడనుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది తల్లులు, అక్కాచెల్లెళ్లకు ఆర్థికంగా మేలు జరగనుంది.
Also read : Delhi Traffic Police Challan: కారులో హెల్మెట్ ధరించలేదని జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీస్!
Also read : CM Kcr Tour: సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ..జాతీయ రాజకీయాలపై చర్చ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook