న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వినిపించింది. డిఏ (dearness allowance) 4% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో బేసిక్ పేలో ఇప్పటివరకు ఉన్న 17% డిఏ (DA) ఇకపై 21 శాతానికి చేరుకోనుంది. డిఏ పెంపు అనంతరం కేంద్రంపై రూ.14,500 కోట్ల అదనపు భారం పడనుంది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ.. '' జనవరి 1 నుంచి ఈ డిఎ పెంపు అమలులోకి వస్తుంది'' అని తెలిపారు.


యధావిధిగానే పెన్షనర్లకు సైతం ఈ పెంపు వర్తించనుంది. 50 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది ఫించనుదారులు డీఏ పెంపు లబ్ధి పొందనున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here