Central Govt Employees Salary Hike: ఈ జనవరి నెల నుంచే 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ(Dearness Allowance), డీఆర్ అందించాలని యోచిస్తోంది.జనవరి నుంచే ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందని సమాచారం. డీఏ, డీఆర్ పెంపు వల్ల సుమారు 61 లక్షల మంది పెన్షనర్లు సైతం ప్రయోజనం పొందనున్నారు. వాస్తవానికి గత డిసెంబర్‌లోనే కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని ఉద్యోగులు భావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రస్తుత 28 శాతం ద్రవ్యోల్బణ రేటు ప్రకారం కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ పెంపును ప్రకటించే అవకాశం ఉందని రిపోర్టులు ప్రచారంలో ఉన్నాయి.  ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసోసియేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ వర్కర్స్ ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్‌కు తెలియజేసింది. దీంతో ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు 28 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ(Dearness Allowance) మరియు డీఆర్ మంజూరు చేయాలని ఆమెకు సూచించినట్లు సమాచారం.


Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్



కోవిడ్ -19 సంక్షోభం కారణంగా జూలై 2021 వరకు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 61 లక్షల మంది పెన్షనర్లకు డీఏని పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్‌లో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Central Govt Employees), పెన్షనర్ల(Pension) కు డీఏను 4 శాతం 21 శాతానికి పెంచడానికి కేంద్ర మంత్రివర్గం గతంలోనే ఆమోదం తెలిపింది. కానీ ఈ పెంపును గత కొన్ని నెలలుగా నిలిపివేశారు. తాజాగా ఈ మొత్తాన్ని జనవరి జీతంతో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన



కేంద్ర ఆర్థికశాఖ ప్రకటన ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాపై అదనంగా డీఏపై రూ .12,510 కోట్లు, డీఆర్‌పై అదనంగా రూ .14,595 కోట్లు  భారం పడనుంది. సాధారణంగా డీఏ, డీఆర్‌లను ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు మొదటి విడత జనవరి నుండి జూన్ వరకు మరియు రెండో విడత జూలై నుండి డిసెంబర్ వరకు ప్రకటిస్తారని తెలిసిందే.


Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook