ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రుల స్పందన
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రులు స్పందించారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రులు స్పందించారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఓట్ల లెక్కింపు తరువాత బీజేపీకి విజయం ఖాయమయ్యాక నితిన్ గడ్కరీ మాట్లాడారు.
రాజ్ నాథ్ సింగ్
" రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ పార్టీ విజయం సాధిస్తుంది. ఫలితాలు కూడా అలానే వస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది"
నితిన్ గడ్కరీ
"గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది". ఎన్నికల్లో ఓడిపోవడానికి ఈవీఎంలే కారణమని చెప్పడం సరికాదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. స్పోర్టివ్ గా తీసుకోవాలి అని అన్నారు.