CAA-2019 Rules: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల్లో షెడ్యూల్‌ విడుదలవుతుందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ సోమవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తరచూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా త్వరలోనే సీఏఏను అమల్లోకి తీసుకువస్తామని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా సీఏఏ అమలును కేంద్రం ప్రకటించింది. ఈ చట్టం అమలుతో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా కూడా వారికి వెంటనే భారత పౌరసత్వం అందించనుంది. ఈ మేరకు చట్టంలో నిబంధనలను కేంద్రం రూపొందించింది. చట్టంగా మారిన నాలుగు సంవత్సరాల తర్వాత సీఏఏ అమలు కావడం వెనుక తీవ్ర ప్రజా వ్యతిరేకతే కారణం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Yousuf Pathan: రాజకీయాల్లోకి యూసుఫ్‌ పఠాన్‌.. మరి కాంగ్రెస్‌ అగ్ర నాయకుడికి చుక్కలు చూపిస్తాడా?


సీఏఏ బిల్లును 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకురాగా తీవ్ర వివాదాస్పదమైంది. సీఏఏను అమలు చేయొద్దని అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్యమం కొనసాగింది. అయినా కూడా మోదీ సర్కార్‌ 2019 డిసెంబర్‌లో తీవ్ర నిరసనల మధ్యనే బిల్లును ఆమోదించుకుంది. సీఏఏ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సంతకం చేయడంతో చట్టంగా రూపుదాల్చింది. సీఏఏ తీసుకువచ్చినా కూడా తాము అమలు చేయమని పలు రాష్ట్రాలు తీర్మానించాయి. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయి. రాష్ట్రాల వ్యతిరేకతను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం సీఏఏను ఏకపక్షంగా అమలుచేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

Also Read: Kamal Haasan: ఎంపీ ఎన్నికలకు కమల్ హాసన్ రాంరాం.. డీఎంకే పార్టీతో కుదిరిన పొత్తు


సీఏఏ అమలుతో ఏం జరుగుతుంది?
భారత రాజ్యాంగంలో పౌరసత్వం అంశానికి సంబంధించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయితే మోదీ ప్రభుత్వం ఆ చట్టంలో కొన్ని నిబంధనలు రూపొందించింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ల నుంచి వలసవచ్చిన ముస్లిమేతర శరణార్ధుల వద్ద తగిన పత్రాలు లేకున్నా కూడా వారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం ద్వారా అవకాశం కల్పించారు. 31 డిసెంబర్‌ 2014 కంటే ముందు ఆ మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందూవులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు పౌరసత్వం పొందాల్సి ఉంది. అయితే పౌరసత్వ ప్రక్రియ అంతా కూడా ఆన్‌లైన్‌లో జరుగుతుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి