LPG Cylinder Price: సామాన్య ప్రజలకు భారీ షాక్.. జనవరి 1న గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం!!
Central Govt Will increase LPG cylinder price: కొత్త సంవత్సరంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుందట. ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
Central Govt Will increase LPG cylinder prices from 2022 January 1: నిత్యావసర వస్తువులో ఒకటైన ఎల్‌పీజీ సిలిండర్ (LPG Cylinder) ధరలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ప్రజలకు రూ. 500 లోపు ఉండే సిలిండర్ ధరలు ఇప్పుడు దాదాపుగా రూ. 1000 అయింది. ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. కొత్త సంవత్సరం (New Year)లో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) భారీ షాక్ ఇవ్వనుందట. దేశంలో ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలపై కొన్ని మార్పులు లేదా కొత్త నియమాలు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభం రోజున (1 జనవరి 2022) కూడా కొన్ని మార్పులు రానున్నాయట.
ఎల్‌పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price)పై ప్రతి నెలా ఒకటో తేదీన అధికారులు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ క్రమంలో 2022 జనవరి 1న జరగనున్న సమావేశంలో ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం అని సమాచారం. అయితే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను మోడీ ప్రభుత్వం చౌకగా మారుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒకటో తేదీన అసలు విషయం తేలనుంది. ఒకవేళ వంటగ్యాస్ ధరలు పెరిగితే మాత్రం సామాన్యులపై మరింత భారం పడక తప్పదు.
Also Read: Ross Taylor: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్
దీపావళికి ముందే ఎల్‌పీజీ సిలిండర్ (LPG Cylinder) ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అయితే కమర్షియల్ సిలిండర్ల ధరలోనే ఈ పెంపుదల చేయడం కాస్త ఊరట కలిగించే విషయం. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.266 భారీగా పెరిగింది. దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.2000 లకు పైగా ఉంది. అంతకుముందు ఇక్కడ రూ.1733గా ఉండేది. ముంబైలో రూ.1683కి లభించే సిలిండర్.. ప్రస్తుతం రూ.1950కి వస్తుంది. కోల్‌కతాలో 19 కేజీల ఇండేన్ గ్యాస్ సిలిండర్ రూ.2073.50 కాగా.. చెన్నైలో రూ.2133గా లభిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి