కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై కేంద్ర మంత్రి ఫన్నీ కామెంట్
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు
భువనేశ్వర్: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. భువనేశ్వర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక ఫ్రంట్ కోసం కేసీఆర్ చేస్తున్న పర్యటనతో తమకు వచ్చే నష్టం ఏమీ లేదని ప్రదాన్ తెలిపారు. కేసీఆర్ ఫ్రంట్ తో ఎన్నికల ఫలితాలు ప్రభావితం కాబోవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్-నవీన్ పట్నాయక్ లను ఆయన జీరోగా అభివర్ణించారు. సున్నా- సున్నా కలిస్తే వచ్చేది జీరోనే కదా అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఎన్ని ఫ్రంట్స్ కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో కాంగ్రెస్-బీజేయేతర ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రంట్ ఏర్పాటుకు మద్దతు కూడగట్టడంలో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ధర్మేందర్ ప్రదాన్ .. కేసీఆర్ - నవీన్ పట్నాయక్ భేటీపై ఈ మేరకు స్పందించారు.