Kishan Reddy: కిషన్ రెడ్డికి మరో అత్యున్నత పదవిని కట్టబెట్టిన మోడీ..
Kishan Reddy: కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తూన్న కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీ మరో కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కిషన్ రెడ్డి కీలక వ్యక్తిగా మారారు.
Kishan Reddy: కిషన్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేత. మరియు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఇక్కడ పార్టీకి 8 ఎంపీ సీట్లు రావడంలో కీ రోలో పోషించారు. అంతేకాదు నరేంద్ర మోడీ 2.O తో పాటు మోడీ 3.O గవర్నమెంట్ లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో పర్యాటకంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి.. ఈ సారి మోడీ మంత్రి వర్గంలో అత్యంత కీలకమైన బొగ్గు గనులు శాఖను నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా.. కేంద్ర మంత్రిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు కిషన్ రెడ్డి. బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే కాన్సెప్ట్ నేపథ్యంలో త్వరలో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారు.
ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కిషన్ రెడ్డికి దేశంలో అత్యంత కీలక రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. ఇదో పెద్ద టాస్క్. తాజాగా కేంద్ర ప్రభుత్వ క్యాబినేట్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో కిషన్ రెడ్డికి చోటు కల్పించింది.
ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మల సీతారామన్, పియూష్ గోయల్, జితిన్ రామ్ మాంఝీ, సర్బానంద్ సోనెవాల్, కింజారపు రామ్మోహన్ నాయుడు, భూపేంద్ర యాదవ్, అన్నపూర్ణ దేవి, కిరణ్ రిజిజు, జి. కిషన్ రెడ్డికి కూడా ఇందులో చోటు కల్పించారు. మొత్తంగా ఇతర పార్టీల నుంచి జితిన్ రాం మాంఝీతో పాటు టీడీపి నుంచ రామ్మోహన్ నాయుడులకు ఇందులో చోటు దక్కడం విశేషం.
కిషన్ రెడ్డి విషయానికొస్తే.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్ రెడ్డి.. 2018 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అటు 2024లో కూడా రెండోసారి ఇదే స్థానం నుంచి ఎంపీగా గెలిచి రెండోసారి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో బొగ్గు శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read: C Naga Rani IAS: వెస్ట్ గోదావరికి పవర్ ఫుల్ ఆఫీసర్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే అందరికీ హడలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి