Duty Free on Imports of Crude Sunflower Oil: దేశంలో వంట నూనెల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వేళ.. ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ సోయాబీన్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌‌పై కస్టమ్స్ డ్యూటీ, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్‌(ఏఐడీసీ)ను మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు రాబోయే ఆర్థిక సంవత్సరానికి 20 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ సోయాబీన్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా నిర్ణయంతో పెరిగిన వంట నూనెల ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) పేర్కొంది. ఇప్పటికే క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్‌పై బేసిక్ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను కేంద్రం రద్దు చేసింది. 5 శాతం ఏఐడీసీని మాత్రం కొనసాగిస్తూ వచ్చింది. 


గ్లోబల్ మార్కెట్‌కు రష్యా-ఉక్రెయిన్ నుంచే మూడింట రెండు వంతుల సన్ ఫ్లవర్ ఆయిల్ సప్లై అవుతోంది. గత కొద్ది నెలలుగా ఈ రెండు దేశాలు యుద్ధంలో తలమునకలవడంతో గ్లోబల్ మార్కెట్‌లో సన్ ఫ్లవర్ ఆయిల్ కొరత ఏర్పడింది. దానికి తోడు సౌత్ అమెరికాలో కరువు పరిస్థితుల కారణంగా సోయాబీన్ ఉత్పత్తి తగ్గిపోయింది. అదే సమయంలో పామాయిల్ అధికంగా ఉత్పత్తి చేసే ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. డిమాండ్‌కు తగిన సప్లై లేకపోవడంతో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ వంట నూనెల ధరలు గణనీయంగా పెరగ్గా.. సామాన్యులకు కాస్త ఉపశమనమిచ్చేందుకు కేంద్రం కస్టమ్స్ డ్యూటీతో పాటు ఏఐడీసీ మినహాయింపుకు నిర్ణయం తీసుకుంది. 



Also Read: Venkatesh about f3 movie : దేవుడి దయవల్ల నేను కోవర్జిన్‌ని : వెంకటేష్


Also Read: Konaseema District Protests Live Updates: కోనసీమ జిల్లా పేరు మార్పుతో భగ్గుమన్న అమలాపురం.. విధ్వంసంపై స్పందించిన మంద కృష్ణ మాదిగ


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook