Edible Oil Prices: వంటనూనెలపై సుంకాన్ని తొలగించిన కేంద్రం, రేపటి నుంచే అమలు
edible oil prices: ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అలాగే వీటిపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది. దీంతో దేశంలో వంట నూనె ధరలు తగ్గనున్నాయి.
Centre scraps basic customs duty; cuts agriculture cess on crude palm, soyabean and sunflower oil: నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య పౌరుడికి కాస్త ఊరట లభించనుంది. ముడి పామాయిల్ (palm oil), సోయాబీన్ (soyabean), పొద్దుతిరుగుడు నూనెలపై (sunflower oil) బేసిక్ కస్టమ్స్ (basic customs) సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అలాగే వీటిపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది. దీంతో దేశంలో వంట నూనె ధరలు తగ్గనున్నాయి.
కొన్ని రోజులుగా వంట నూనెల ధరలు బాగా పెరిగాయి. పండగ సీజన్ కావడంతో ప్రజలంతా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులుపడ్డారు. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ముడి వంట నూనె రకాలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తొలగించింది. అలాగే అగ్రిసెస్‌ను (agriculture cess) తగ్గించింది.
Also Read : Terrorist encounter : జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్.. జైషే-ఈ-మహమ్మద్ ఉగ్రవాది హతం
దీంతో ముడి పామాయిల్‌పై అగ్రిసెస్ 7.5శాతానికి, ముడి సోయాబిన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనెపై (sunflower oil) 5.5శాతానికి తగ్గింది. ఇక రిఫైన్డ్ వంట నూనెలపైనా బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 32.5శాతం నుంచి 17.5శాతానికి తగ్గించింది కేంద్రం. ఈ తగ్గింపు అక్టోబరు 14న అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం (central government) చెప్పింది. 2022 మార్చి 31 వరకు ఇది కొనసాగుతుంది.
Also Read : BiggBoss Telugu5: నేను కోరుకున్న ప్రేమ శ్రీరామ్ దగ్గర ఉంది - హమీదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి