Centre tells states this about COVID-19 symptoms - Know details of 8 symptoms here : దేశంలోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం సూచించింది. అనుమానిత రోగుల పాటు వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి కోవిడ్ టెస్ట్‌లు చేయించాలని కేంద్రం కోరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, ఊపిరి ఆడకపోవడం, ఒళ్లు ఒప్పులు, రుచి లేదా వాసన కోల్పోవడం, అలసట, డయేరియా వంటి లక్షణాలను కోవిడ్‌-19గా (Covid‌-19) అనుమానించి.. వెంటనే పరీక్షలు చేయించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అలాంటి లక్షణాలున్న వారందరినీ వెంటనే వేరుగా ఉంచాలని పేర్కొంది. ఇంటివద్ద ఐసొలేషన్‌ మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని కేంద్రం తెలిపింది. ఇలాంటి లక్షణాలున్న వారిని సపరేట్‌గా ఉంచితేనే కోవిడ్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని చెప్పింది.


కోవిడ్‌ టెస్ట్‌లకు (Covid‌ Test‌) అవసరమయ్యే కిట్స్, ల్యాబొరేటరీ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇందుకోసం అత్యవసర కోవిడ్‌ 19 నిధుల్ని వినియోగించాలని సూచించింది. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ల్లో వేగం పెంచాలని కోరింది. 24/7 పని చేసే ర్యాట్‌ బూత్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. వాటి నిర్వహణకు తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలంది. కోవిడ్ లక్షణాలున్నవారు సొంతంగా.. పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించింది కేంద్రం.'


Also Read : RRR Postponed: ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఒమిక్రాన్ ధాటికి రిలీజ్ వాయిదా


2021 డిసెంబర్ 26 నుంచి దేశంలో కోవిడ్ కేసులు (Kovid cases) ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కోవిడ్ కొత్త వేరియెంట్ (Covid new variant) ఒమిక్రాన్ కేసులు కూడా ఎక్కువగా నమోదు కావడంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.


Also Read : Telugu Films On OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న అఖండ, పుష్ప.. రిలీజ్ ఎప్పుడంటే?!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి