Chandigarh university viral video: పంజాబ్ లోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో దారుణం జరిగింది. చండీగఢ్ యూనివర్శిటీకి చెందిన 60 మంది విద్యార్థినుల బాత్ రూమ్ వీడియోలు లీక్ అయ్యాయి. హాస్టల్ లో అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలు యూట్యూబ్ లో దర్శనమిచ్చాయి. ఈ ఘటనతో వర్శిటీలో కలకలం రేగింది. విద్యార్థినులు హాస్టల్ రూమ్ లో స్నానం చేస్తుండగా.. మరో యువతి వీడియో తీసింది. ఆ వీడియోలను తన భాయ్ ప్రెండ్ కు పంపించింది. దీంతో అతడు యూనివర్శిటీ అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. ఈ తతంగం చాలా రోజులుగా సాగుతున్నట్లు గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాము స్నానం చేస్తున్న వీడియోలు వెబ్ సైట్ లో రావడంతో షాకయ్యారు చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ వీడియోలు లీక్ అయ్యాయనే మన స్తాపంతో ఎనిమిది అమ్మాయిలు ఆత్మహత్యాయత్నం చేశారు.  వాళ్లను హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. మిగితా వాళ్లు చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనతో క్యాంప్ లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. న్యాయం చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన పంజాబ్ లో కలకలం రేపుతోంది.



Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok