Chandrayaan 3 Where to Watch Live Telecast: యావత్ ప్రపంచ మొత్తం కళ్లన్నీ చంద్రయాన్-3పైనే ఉన్నాయి. ఇస్రో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక మిషన్ సక్సెస్ అయితే భారత్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ఇస్రో కీర్తి ప్రపంచ పతాకస్థాయికి చేరుతుంది. జాబిల్లికి చేరువగా ఉన్న చంద్రయాన్-3 బుధవారం ల్యాండింగ్ కానుంది. చారిత్రత్మక ఈ ఘట్టాన్ని చూసేందుకు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ ద్వారా అంతరిక్ష పరిశోధన రంగంలో ఇండియా గొప్ప ఫీట్‌ను సాధించబోతోంది. ఈ మధుర క్షణాలను వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో ఇప్పటికే వెళ్లడించింది. ఈ చారిత్రాత్మక ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5:27 గంటలకు ప్రారంభంకానుంది. ఇస్రో వెబ్‌సైట్, ఇస్రో యూట్యూబ్ ఛానెల్, ఇస్రో ఫేస్‌బుక్ పేజీ, డీడీ నేషనల్ టీవీ ఛానెల్‌తో పాటు నేషనల్ జియోగ్రాఫిక్ టీవీ ఛానెల్‌తో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. 


"చంద్రయాన్-3 లైవ్ ప్రసారం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్‌లు రెండింటిలోనూ జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం 4 గంటలకే ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు ఈ ఈవెంట్‌ను చూసేందుకు క్యాంపస్‌లలో  ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలల్లో చూసేందుకు వీలు లేకపోతే మరుసటి రోజు మరోసారి ప్రసారం చేయనున్నారు. ఉద్విగ్న క్షణాల కోసం ప్రతి భారతీయుడు ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు.


 




చంద్రయాన్-3 ప్రయాణం దాదాపు 40 రోజులుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న ప్రారంభమైంది. రేపు సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఈ ధృవంపై ఎంట్రీ ఇచ్చిన తొలి దేశంగా భారత్ నిలవనుంది.


Also Read: Minister Harish Rao: అభ్యర్థుల ప్రకటన తర్వాత కేసీఆర్ మొదటి సభ.. మెదక్‌లో ప్రగతి శంఖారావం: మంత్రి హరీశ్ రావు  


Also Read: TS Politics: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు జంప్.. పార్టీ మారనున్న నేతలు వీళ్లే..!   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook