Chandryaan 3 Journey: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 విజయవంతానికి మరి కొద్దిగంటలే మిగిలింది. చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అంతా సవ్యంగా జరిగితే చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన తొలి మిషన్ ఇదే కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రయాన్ 2 వైఫల్యంతో ఇస్రో చాలా పాఠాలు నేర్చుకుంది. చంద్రయాన్ 3 వైఫల్యం చెందకూడదని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. దాదాపు 40 రోజుల చంద్రయాన్ 3 ప్రయాణం దాదాపు పూర్తయింది. మరి కొద్దిగంటల్లో రేపు అంటే ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది.


యావత్ దేశమే కాదు..ప్రపంచమంతా ఇప్పుడు ఇస్రో వైపు చూస్తోంది. చంద్రయాన్ 3 విజయవంతమైతే ఇండియా సరికొత్త చరిత్రను లిఖించనుంది. ఇస్రో కీర్తి మరింత పెరగనుంది. ఆగస్టు 20వ తేదీన రెండవ, చివరి డీబూస్టింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో చంద్రయాన్ 3 జాబిల్లికి మరింత చేరువైంది. 40 రోజుల చంద్రయాన్ 3 ప్రయాణంలో ఎన్నో దశల్ని ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. అంతా అనుకున్నట్టుగా సాగితే రేపు సాయంత్రం సాఫ్ట్ ల్యాండింగ్‌తో ఇస్రో తనదైన ముద్ర వేయనుంది. చంద్రయాన్ 3 ప్రయాణంలో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్దాం..


జూలై 6 :  జూలై 14వ తేదీన ఏపీలోని శ్రీహరికోట రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగం ఉంటుందని ప్రకటించిన ఇస్రో


జూలై 7 : అన్ని వెహికల్ ఎలక్ట్రికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తి


జూలై 11 :  24 గంటల లాంచ్ రిహార్శల్ విజయవంతం


జూలై 14 : LVM3 M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3ను విజయవంతంగా ప్రయోగం


జూలై 15 : మిషన్‌లో మొదటి ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియ విజయవంతం. 41762 km x 173 km కక్ష్యలో చేరుకున్న స్పేస్‌క్రాఫ్ట్


జూలై 17 : రెండవ ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియ పూర్తి, 41603 km x 226 km కక్ష్యలో చేరుకున్న చంద్రయాన్ 3


జూలై 22 : నాలుగవ ఆర్బిట్ రైజింగ్ విజయవంతం,  71351 km x 233 km కక్ష్యలో చేరిన స్పేస్‌క్రాఫ్ట్


చంద్రుని కక్ష్యలో కీలక పరిణామాలు


ఆగస్టు 1: 288 km x 369328 km పరిధిలో ట్రాన్స్‌‌లూనార్ కక్ష్యలో ప్రవేశం


ఆగస్టు 5:  స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య పరిధిని 164 km x 18074 kmకు తగ్గింపు


ఆగస్టు 6:  స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య పరిధి 170 km x 4,313 kmకు తగ్గింపు


ఆగస్టు 9:  స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య పరిధి మరింతగా 174 km x 1437 kmకు తగ్గించిన ఇస్రో


ఆగస్టు 14: చంద్రయాన్ మిషన్ వృత్తాకార కక్ష్యలో ప్రవేశం


ఆగస్టు 17:  చంద్రయాన్ 3 మిషన్‌లో అత్యంత కీలకమైన ప్రక్రియ. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ 


ఆగస్టు 18: మొదటి  డీబూస్టింగ్ ప్రక్రియ విజయవంతం, చంద్రుని కక్ష్యలో కేవలం  113 km x 157 km దూరంలో చంద్రయాన్ 3


ఆగస్టు 20:  చంద్రయాన్ 3 మిషన్‌లో రెండవ, చివరి డీబూస్టింగ్ ప్రక్రియ సక్సెస్, చంద్రునికి కేవలం 25 km x 134 km దూరంలో కేంద్రీకృతం


ఆగస్టు 23: అన్నీ అనుకున్నట్టు జరిగితే సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్. చంద్రయాన్ 3 విజయవంతం


Also read: Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ వాయిదా పడనుందా, ఇస్రో ప్లాన్ బి ఏంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook