తెలంగాణ సీఎంకి ఛత్తీస్‌ఘడ్ సీఎం కౌంటర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే థర్డ్ ఫ్రంట్ అంశాన్ని లేవనెత్తి... బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యమ్నాయంగా ఒక ప్రభుత్వం భారతదేశంలో రావాల్సిన అవసరముందని తెలిపిన విషయం తెలిసిందే.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే థర్డ్ ఫ్రంట్ అంశాన్ని లేవనెత్తి... బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యమ్నాయంగా ఒక ప్రభుత్వం భారతదేశంలో రావాల్సిన అవసరముందని తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై ఛత్తీస్‌ఘడ్ సీఎం రమణ్ సింగ్ స్పందించారు. థర్డ్ ఫ్రంట్ మాత్రమే కాదు... అలాంటి ఫ్రంట్‌లు ఎన్ని వచ్చినా.. బీజేపీ శక్తి ముందు దిగదుడుపేనని.. బీజేపీ ఎదుగుదలను ఆపడం ఎవరి తరమూ కాదు అని స్టేట్‌మెంట్ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడిన క్రమంలో రమణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అనుభవంతో తాను దేశ రాజకీయాల్లోకి అడుగుపెడతానని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. జార్ఖండ్ నేత హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్ ఆలోచనను స్వాగతించారు. ఏదేమైనా.. దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర కీలకమవబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి