Auto luxury house: ఆటోపై లగ్జరీ హౌస్. అదెలా సాధ్యం. బుల్లి ఆటోపై అసలు ఇళ్లు నిర్మించడమేంటి..అది కూడా లగ్జరీ ఇళ్లు. నిజమేనా. ముమ్మాటికీ నిజం. ఎక్కడో కాదు. ఇండియాలోనే. చెన్నై ఆర్కిటెక్ట్ ఘనత ఇది. అందుకే ఆనంద్ మహీంద్రా ఫిదా అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నైకు చెందిన అరుణ్ అనే ఆర్కిటెక్ట్ సోషల్ మీడియాలో చాలా సెన్సేషన్ అవుతున్నాడు. కారణం సాధారణ ఆటోపై లగ్జరీ ఇళ్లు నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ ఆటో హౌస్‌లో చిన్న బెడ్ రూమ్, కిచెన్, లివింగ్ ఏరియా, బాత్‌రూమ్‌తో పాటు వర్క్ ఏరియా కూడా ఉంది. అంతేకాదు 250 లీటర్ల వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మొబైల్ హౌస్ నిర్మించేందుకు అతడికైన ఖర్చు లక్షరూపాయలు మాత్రమే.  వాస్తవానికి ఏడాది క్రితమే ప్రభు ఈ ఆటో లగ్జరీ హౌస్ నిర్మించినా..ఇటీవల ఈ ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి.


ఈ ఆటో హౌస్ ఫోటోలు చూసి ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రను ఆకర్షించింది. ఈ ఫోటోలు చూసి ఫిదా అయిపోయారు. ఆ ఫోటోల్ని రీ ట్వీట్ చేశారు. చిన్న చిన్న స్థలాల్లో కూడా నివాస సదుపాయాలు ఎలా ఏర్పర్చుకోవచ్చనేది అరుణ్ ప్రభు చేసి చూపించాడు. అయితే త్వరలో అరుణ్ దృష్టి త్వరలో ఇంతకంటే పెద్ద ట్రెండ్‌పై పడాలని కోరుకుంటున్నాను. బొలేరో  వాహనంపై కూడా ఇలాంటి ఇళ్లు నిర్మించగలడా..ఎవరైనా అతడి వివరాలు నాకు చెప్పగలరా అని ట్వీట్ చేశారు.



Also read: Free LPG Gas Connections: రెండేళ్లలో కోటిమందికి ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook